ఓటీటీలో వ‌చ్చేస్తున్న ‘హ్యాపీ బ‌ర్త్‌డే’

లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ జులై 8న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా నిరాశ‌ప‌రిచింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఆగ‌స్ట్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దేశంలో తుపాకీ చ‌ట్టాన్ని ప్ర‌వేశ‌పెడితే అప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నే క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెన్నెల కిశోర్, స‌త్య‌, న‌రేశ్ అగ‌స్త్య కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

Exit mobile version