అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సృష్టిలో సగభాగం మహిళ, ప్రతీ మనిషి జీవితంలో మహిళలది కీలకపాత్ర.మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే. ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని ట్వీట్ చేశారు.