దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఉద్యమంపై నటి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేతలతోనే కాదు మాటలతో ఇబ్బంది కలిగేలా చేసినా అది వేధింపులతో సమానమేనని అభిప్రాయపడ్డారు. స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న టాక్ షోలో పాల్గొన్న ఆమె ఈ మేరకు మాట్లాడారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లలో ఎవరితో డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నారని స్మిత ప్రశ్నించగా, ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుటుందని సాయిపల్లవి బదులిచ్చారు