హైదరాబాద్‌లో ఓ టీవీ ఛానల్లో యాంకర్‌గా పనిచేస్తున్న యువతిని కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నవ్యక్తిపై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతికి కళాశాలలో చదివే రోజుల్లో కూకట్‌పల్లికి చెందిన సామ్రాట్‌తో పరిచయం ఉంది. అప్పట్లో అతడు ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించడంతో స్నేహితులుగా ఉందామని నమ్మించాడు. ఓసారి యువతిని కారులో తీసుకెళ్లిన సామ్రాట్, నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి యత్నించాడు. ఆ తర్వాత ఆమె ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి,తన కోరిక తీర్చకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు