ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయగా.. జట్టులో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలకు కూడా స్థానం కల్పించారు. ఈ జట్టులో హార్దిక్ పాండ్యా (C), భువనేశ్వర్ కుమార్ (VC), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (WK), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఆడనున్నారు.