మొదటి సారి ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ చేసిన హార్దిక్ పాండ్యా ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. పాండ్యాకు ఫిట్నెస్ లేదని అతడిని ఇండియన్ టీం నుంచి తప్పించాలని చాలా మంది చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆరోపణలకు పాండ్యా తన ఆటతోనే సమాధానం చెప్పాడు. ఈ సారే నూతనంగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టును విన్నర్‌గా నిలిపాడు. పాండ్యా ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ స్పందించాడు. హార్దిక్ పాండ్యా ఇండియా జట్టుకు కాబోయే కెప్టెన్ అని కొనియాడాడు. టైటిల్ గెలిచిన గుజరాత్ జట్టును ఆకాశానికెత్తాడు.