• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్

    పటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ మే 18న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన భవిషత్తుపై వివిధ రకాల ఊహాగానాలను మొదలయ్యాయి. అతను ఏ పార్టీలో చేరతాడనే ఉత్కంఠ నెలకొంది. వీటికి ఇప్పుడు తెర పడింది. హార్దిక్ పటేల్ బీజేపీ చేరనున్నాడని గుజరాత్ బీజేపీ మీడియా కన్వీనర్ యగ్నేష్ దవే వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో అతను తన అనుచరులతో కలిసి హార్దిక్ బీజేపీలో చేరనున్నాడని దవే తెలిపారు.