పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ నిర్మాత AM రత్నం అన్నారు. అయితే దీనిపై బ్యానర్ నుంచి అధికారికంగా ఏమీ చెప్పలేదు. అలాగే దర్శకుడు క్రిష్ కూడా ఏమీ ప్రకటించలేదు. ఎండాకాలంలో ఈ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు వేసుకుంటున్నారు.