‘హరిహరవీరమల్లు’ సెట్‌లో హరీష్

Courtesy Twitter: Harish Shankar .S

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న‘హరిహరవీరమల్లు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా పవన్ కల్యాణ్‌తో హరీశ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ‘తేరి’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. త్వరలో ఈ మూవీని పట్టాలెక్కించనున్నారు.

Exit mobile version