టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పాటు, ముందుగా అనుకున్న సినిమాలు చేయడంతో ఈ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఈ చిత్రం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. పవన్ అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేయనుండడంతో పాటు, హరిహర వీర మల్లుతో బిజీ ఉండడంతో హరీష్ శంకర్ మరో మూవీపై ఫోకస్ పెట్టనున్నాడట. పవన్ షెడ్యూల్స్ అన్ని పూర్తయ్యాక ‘భవదీయుడు భగత్ సింగ్’ తెరకెక్కిస్తారట.