సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి రుజువైంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా 10,12 పరీక్షలు పాస్ అయ్యాడు. మంగళవారం రోజు హర్యానా ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు ఆయనకు మార్కుల పత్రాలను అందజేశారు. గతేడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో చౌతాలా 100కు 88 మార్కులు సాధించాడు. ఆయన 2021లో 12వ తరగతి పరీక్షలు రాసినప్పటికీ చౌతాలా 10వ తరగతి పాస్ కానందున ఆయన రిజల్ట్‌ను అధికారులు నిలిపివేశారు.