హర్యానా హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోవచ్చని తెలిపింది. జూన్ 8న పెళ్లి చేసుకున్న ఒక 16 ఏళ్ల యువతి, 21 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి మాకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం షరియా చట్టం ప్రకారం ముస్లిం 15 ఏళ్లకే అమ్మాయిల్ని, అబ్బాయిలను కూడా పెద్దలుగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. అదేవిధంగా ముస్లిం వ్యక్తిగత చట్టం గురించి దిన్షా ఫర్దూన్‌జీ ముల్లా రచించిన పుస్తకంలోని 195 సెక్షన్ ప్రకారం అమ్మాయి 16 ఏళ్లు నిండిన తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని పేర్కొంది. ఆ దంపతులకు ఆశ్రయం కల్పించాలని పఠాన్‌కోట్ పోలీసులను కోర్టు ఆదేశించింది.