వన్డేల్లో టీమిండియా అదరగొడుతోంది. వరుస వైట్‌వాష్‌లతో తొలి స్థానానికి దూసుకెళ్లింది. అయితే, బ్యాటింగ్‌లో భారత్ మెరుగ్గా రాణిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారీ టార్గెట్‌ని నిర్దేశించాలనే సంకల్పంతో ఉంది. గత ఐదు వన్డేల్లో ఈ దృక్పథం స్ఫష్టంగా కనిపించింది. డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ 409 పరుగులు చేసింది. శ్రీలంకతో తొలి వన్డేలో 373, మూడో వన్డేలో 390; న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 349, మూడో వన్డేలో 385 పరుగులు చేసింది. ఈ పంథాను ఇలాగే కొనసాగిస్తుందో లేదో చూడాలి.