తపాల శాఖలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మెుత్తం 188 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేయగా..నవంబర్ 22 వరకు ఆన్లైన్లో నమోదుకు అవకాశం ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ పోస్టులకు 10 తరగతి, మిగిలిన వాటికి ఇంటర్ లేదా సమానమైన పరీక్ష పాస్ అవ్వాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.