స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుమారుడికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఈ సారి తన కొడుకు ఫుల్ ఫొటోను షేర్ చేసింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. తన కుమారుడు నీల్ కిచ్లూ పుట్టి 9 నెలల పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా కాజల్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ‘‘ఏడాదిలో మూడొంతులు పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.’’ అంటూ పేర్కొంది. కాగా కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.