HYD: మూసీ నది అనగానే మనకు దుర్వాసనే గుర్తుకొస్తుంది. హైదరాబాద్‌కు ముఖ్య నదిగా ఉన్న మూసీ క్రమంగా కాలుష్య భూతానికి బలైంది. పెరిగిన జనాభాతో రాను రాను మూసీ నదీ జలాలు గరళాన్ని తలపిస్తున్నాయి. అటు వైపు వెళ్లాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. అయితే, ఒకప్పుడు మూసీ ఒడ్డునే పంటలు పండించేవారు. మూసీ నది ఎంతో ఆహ్లాదంగా ఉండేదో 1887లో తీసిన ఈ చిత్రాన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది. కాలుష్య నివారణకు ప్రస్తుతం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయినా, మూసీ ప్రక్షాళన సంపూర్ణంగా జరగడం లేదనేది నగరవాసుల ప్రధాన ఆరోపణ.