హైదరాబాద్ బేగంపేట్లో భారీగా హవాలా నగదు పట్టుబడింది. సుమారు రూ. 4 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్విఫ్ట్ కారులో తరలిస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే హవాలా సొమ్ము తరలింపుపై పోలీసులు నిఘా పెట్టారు. తనిఖీలు, సోదాలు ముమ్మరం చేసి అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటివరకు చాలా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.