HBD హర్భజన్.. ఈ భజ్జీకి ఘాటెక్కువే.. – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD హర్భజన్.. ఈ భజ్జీకి ఘాటెక్కువే.. – YouSay Telugu

    HBD హర్భజన్.. ఈ భజ్జీకి ఘాటెక్కువే..

    © File Photo

    ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్న క్రికెటర్లలో ది టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఒకరు. 1980 జలంధర్‌లో జన్మించిన ఈ టర్బోనేటర్ 15 సంవత్సరాల వయసులోనే U-16 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ అదరగొట్టిన భజ్జీకి 16 సంవత్సరాలు కూడా నిండకముందే U-19 నుంచి పిలుపొచ్చింది. ఆడిన ప్రతి చోటా ఆకట్టుకున్న టర్బోనేటర్ కు 1999లో సీనియర్ జట్టులోకి ఆహ్వానం వచ్చింది. మొత్తంగా హర్భజన్ తన ఇంటర్నేషనల్ కెరియర్‌లో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. అంతే కాకుండా మనోడు IPLలో కూడా.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం అంర్జాతీయ క్రికెట్లో 707 వికెట్లు తీసిన భజ్జీ… అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో ఉన్నాడు. .. ఇండియా తరఫున టెస్టుల్లో మొదటి హ్యాట్రిక్ తీసింది భజ్జీనే. ప్రస్తుతం పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టర్బోనేటర్ కు షార్ట్ న్యూస్ యాప్ Yousay తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

    Exit mobile version