నేడు దళపతి విజయ్ బర్త్‌డే. కోలీవుడ్‌లో అగ్రకథానాయకుల్లో విజయ్ ఒకరు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ విజయ్ తండ్రి. తన సినిమాలతో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇటీవల ‘బీస్ట్’ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈ దళపతి. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళంలో తెరకెక్కుతుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి విజయ్ లుక్‌ను నేడు రివీల్ చేశారు.