ప్రస్తుతమున్న ఇంటర్నెట్ కాలంలో ఏ చిన్న పని చేసినా అది వైరల్ అవ్వాల్సిందే. అలాంటిదే ఈ ఘటన. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ భూపతి రూపాయి చిల్లర కాయిన్లతో రూ.2.6 లక్షల డొమినర్ బైక్ కొనుగోలు చేశాడు. తాను మూడేళ్ళ నుంచి ఈ కాయిన్లను సేకరించామని, వాటితోనే తన కలల బైక్ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు అడుగులేస్తున్న తరుణంలో భూపతి చిల్లరతో బైక్ కొనడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. మరి మీరు కూడా ఓ సారి ఆ వీడియోను చూసేయండి.