ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్లో దారుణం జరిగింది. పెళ్లికి అంగీకరించలేదని 14 ఏళ్ల బాలికను ఓ యువకుడు హత్య చేశాడు. నిందితుడు సోను బంజారాగా గుర్తించారు. శనివారం అదృశ్యమైన బాలిక…హజీపూర్ గ్రామంలోని చెరుకు తోటలో శవమై కనిపించింది. బాలిక తండ్రి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకోవాలని కుమార్తెపై ఒత్తిడి తేవటంతో పాటు తమ కుటుంబాన్ని బెదిరించాడని కేసు పెట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు..సోనుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పెళ్లికి అంగీకరించలేదని చంపేశాడు

© Envato