మద్యం మత్తులో ఉన్న ఓ పాములు ఆడించుకునే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి.. పాముతో ఫోటో దిగాలనే కుతూహలం ఓ యువకుడి ప్రాణా తీసింది. నెల్లూరు జిల్లా కందుకూరులో మణికంఠరెడ్డి అనే యువకుడు ఓ జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడికి ఓ పాములు పట్టే వ్యక్తి రాగా అతడి దగ్గరున్న పాముతో ఫోటోలు దిగాలనుకున్నాడు. అప్పటికే మత్తులో ఉన్న ఆ వ్యక్తి పాముకు కోరలు తీసేశానని… ఏం కాదని ధైర్యం చెప్పాడు. ఈ క్రమంలో పాముతో సెల్ఫీ దిగుతుండగా అది కాటేసింది. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లినా.. పాము అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.