వాటర్ సప్లై ఆపేసిందని భార్య, కూతురిని చంపేశాడు

© File Photo

యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వాటర్ సప్లై ఆపేసిందని భార్యతో పాటు కూతురిని కూడా చంపేశాడో కిరాతకుడు. వివరాల్లోకెళ్తే.. ఘజియాబాద్‌లో సంజయ్ పాల్(42) నివాసముంటున్నాడు. అయితే అతనికి అతని భార్య రేఖ(36)కు అభిప్రాయభేదాలు ఉన్న కారణంగా ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్‌లో వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంటికి రేఖ వాటర్ సప్లై ఆపేసిందని పారతో కూతురిని, భార్య రేఖను హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

Exit mobile version