దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్, డేటింగ్ యాప్స్ అంటూ కేటుగాళ్లు సొమ్ము కాజేస్తున్నారు. అలాంటి ఘటనే సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ డాక్టర్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే డేటింగ్ యాప్స్‌కు బానిసైన ఈయనను కొందరు యువతులు ట్రాప్ చేసి ఫోటోలను తీసుకున్నారు. వాటిని మార్ఫ్ చేసి రూ.కోటిన్నర కాజేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. డాక్టర్‌కు పోలీసులు మూడుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా పట్టించుకోకపోవడంతో పాటు ఆ యాప్స్‌కు ఇంకా అడిక్ట్ అయిపోయాడు.
డేటింగ్ యాప్ ద్వారా రూ.కోటిన్నర పోగొట్టుకున్నాడు

© Envato