బ్రిటన్‌కు చెందిన పదేళ్ల ‘మ్యాక్స్ వూజీ’ తన మంచి మనసు చాటుకున్నాడు. మూడేళ్ల పాటు టెంటులో నిద్రించడం ద్వారా వచ్చిన రూ.7 కోట్ల నిధులను స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. బాలుడి ఇంటి పక్కన ఉండే 74 ఏళ్ల రిక్ అబాట్ కేన్సర్‌తో చనిపోయారు. ఏదైనా సాహస కార్యం చేయాలని ఆయన చెప్పిన మాటలు బాలుడి మనసులో నాటుకు పోయాయి. దాంతో 2020 మార్చి నుంచి ఇంట్లో కాకుండా మూడేళ్లపాటు ఆరుబయట టెంట్‌లో మ్యాక్స్ నిద్రించాడు. బాలుడ్ని ప్రోత్సహిస్తూ పలువురు విరాళాలు పంపించారు.