తన కెరీర్ ప్రారంభంలో అప్పటి కెప్టెన్ సలీం మాలిక్ తనను వేధించాడని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తెలిపాడు. తన బయోగ్రఫీ ‘సుల్తాన్ ఏ మెమొయర్’లో ఈ విశేషాలను పొందుపరిచాడు. ‘‘ నేను సలీం కన్నా రెండేళ్ల జూనియర్. నన్ను ఒక పనివాడిలా చూసేవాడు. మసాజ్ చేయాలని, తన బూట్లు తుడవాలని, బట్టలు ఉతకాలని ఆదేశించేవాడు. అప్పుడు సలీంపై కోపం వచ్చేది’’ అంటూ అక్రమ్ సంచలన ఆరోపణలు చేశారు. కాగా సలీం మాలిక్ కెప్టెన్సీలో అక్రమ్ 1992-95 వరకు ఆడాడు.