మరి కొన్ని గంటల్లో లండన్ విమానం ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ మండలం హనుమంతుపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాడిపర్తి శివకృష్ణ(24) ఉన్నత చదువుల కోసం బుధవారం లండన్ విమానం ఎక్కాల్సి ఉంది. కానీ స్నేహితులను కలసి వస్తానని చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులకు అనుమానమొచ్చి వెతకగా ఎన్నెస్పీ కాల్వ కట్ట పక్కన చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.