భారత రంజీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎంత బరువు ఉంటే అన్ని శతకాలు బాదేస్తాడని భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ‘‘రంజీల్లో ముంబై తరఫున సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. అలాంటి బ్యాటర్‌ను టెస్టులకు ఎంపికచేయకపోవడం శోచనీయం. ఇది ఏకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను అవమానించడమే అవుతుంది. రన్స్ రాబట్టేందుకు సర్ఫరాజ్ ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఎంత అధిక బరువున్నాడో.. అన్ని సంచరీలు బాదేస్తాడు.’’ అంటూ వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు.