• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIC కి ఎదురుగాలి.. క్షీణిస్తున్న మార్కెట్ వాటా!

    ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా వేగంగా పడిపోతోంది. గత 3 నెలల్లో దాదాపు 4 శాతం లేదా సుమారు 400 బేసిస్‌ పాయింట్లు దిగజారింది. గత ఏడాది నవంబర్‌ ఆఖర్లో 67.73 శాతంగా ఉన్న ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా, ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో 63.8 శాతానికి క్షీణించింది. ఫిబ్రవరిలోనూ దాదాపు ఒక్క శాతం ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా పతనమైంది. ఆర్థిక సంవత్సరం ముగింపులో బీమా ఇండస్ట్రీ ఊపందుకుంటుంటే ఎల్‌ఐసీ జోరు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రైవేట్‌ బీమా సంస్థల హవా పెరుగుతుండటం గమనార్హం.