మనుషులకు ఆరోగ్య బీమా పథకాలు ఉండటం మామూలే. చాలా ఇన్సూరెన్స్ సంస్థలు ప్రీమియం చెల్లింపులతో బీమా పాలసీలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో శునకాలకూ బీమా చేయిస్తున్నాయి కొన్ని సంస్థలు. దీనికి గానూ రూ.2లక్షల వరకు రూ. 3-10 వేల ప్రీమియంతో ప్యాకేజీలిస్తున్నాయి. అయితే, వాటికి బీమా చేయించాలంటే తొలుత వైద్య పరీక్షలు చేయించి.. ఒక బార్ కోడ్ మైక్రోచిప్‌ను మెడపై సూది ద్వారా అమర్చాలి. ఈ బార్ కోడ్‌ను స్కానర్ ద్వారా గుర్తించి బీమా పాలసీని అమలు చేస్తారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు ఆరోగ్య బీమా చేయించారు.