సినీ నటి పునర్నవి భూపాలం అనారోగ్యంతో బాధపడుతుంది.“ ఊపిరితిత్తుల సమస్యతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నా. నేను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరిసారి కావాలి” అంటూ ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. ఉయ్యాల జంపాల చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పునర్నవి…బిగ్‌బాస్ సీజన్ 3 ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆఫర్లు పెద్దగా రాలేదు. కొన్ని చిన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లో చేశారు. ప్రస్తుతం సినీ కెరీర్ పక్కన పెట్టి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది.