ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి బెయిల్ మంజూరు చేయడాన్ని సీబీఐ సవాలు చేసింది. ట్రయల్ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సీబీఐ హైకోర్టుని ఆశ్రయించింది. ఇరు పక్షాల నుంచి రాతపూర్వకంగా వాదనలను న్యాయస్థానం స్వీకరించింది. అనంతరం ఈ కేసును జనవరి 11న విచారణ చేస్తామని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, ఇదే విషయమై ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై విచారణ ట్రయల్ కోర్టులో పెండింగులో ఉంది.