స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ పార్దీవాలతో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. దేశవ్యాప్తంగా దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడిగా విచారించేందుకు గత నెలలో అన్ని పిటిషన్లు సుప్రీంకోర్టుకు సీజేఐ బదిలీ చేశారు. వీటిపై మార్చిలో విచారణ ఉంటుందని పేర్కొన్నారు.