దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముంద్కా మెట్రో
స్టేషన్ 544వ పిల్లర్ నంబర్ వద్దగల ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో భవనంలో ఉన్న సుమారు 27 మంది సజీవ దహనం అవగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఉన్న 60-70 మందిని రక్షించామని, క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.