శ్రీశైలం‌కు భారీ వరద

Courtesy Twitter: SinkaruShivaji1

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుంది. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండిపోగా.. ఇప్పుడు కృష్ణ నదికి వరద పెరుగుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండగా అధికారులు గేట్లు ఎత్తి నీటిని శ్రీశైలం డ్యామ్‌కు వదులుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం‌కు లక్ష క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌లో 827 అడుగుల నీటిమట్టం ఉండగా.. డ్యామ్ పూర్తి స్థాయి సామర్ధ్యం 885 అడుగులు.

Exit mobile version