అసోంను వరదలు ముంచెత్తున్నాయి. గతకొద్ది ఆ రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న వరదలు ఇంకా వదలడం లేదు. ఇప్పటికే 100మంది దాకా ప్రాణాలు కోల్పోగా.. భారీ వరదలతో పాటు కొండ చరియలు విరిగి పడుతుండడంతో ఒక్కరోజులోనే మరో ఏడుగురు మృతి చెందారు. సుమారు 2.68 లక్షల మంది ప్రజలు వరదల్లోనే చిక్కుకొనగా.. 1,395 సహాయక కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడా వరదలపై స్పందించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బాధితులకు సహాయం అందిస్తోందన్నారు.