చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం ఎయిర్‌పోర్టులో 6.8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు రూ.3.32 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. సింగపూర్ నుంచి చెన్నైకు వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.