హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. శనివారం, ఆదివారం కూడా భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీకెండ్ ఉందని బయటకు వస్తే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటుచేశారు. వర్షాలకు విద్యుత్ వైర్లు తెగి పడే అవకాశం ఉన్నందున అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఈ రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందును జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.