మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు

yousay

బంగా‌ళా‌ఖా‌తంలో ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో తెలంగాణలో మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడుతాయని వెల్లడించింది. ఆ తర్వాత ఒక‌ట్రెండు రోజులు పొడి వాతా‌వ‌రణం ఏర్పడి, తిరిగి వానలు కురిసే వీలుందని పేర్కొంది.. తూర్పు-మధ్య బంగా‌ళా‌ఖా‌తంలో అక్టో‌బర్‌ 1న మరో అల్పపీ‌డనం ఏర్పడ‌నుందని వెల్లడించింది. నిన్న హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

Exit mobile version