రాష్ట్రంలో 8 జిల్లాల్లో భారీ వర్షాలు!

© File Photo

ఇవాళ తెలంగాణలోని 8 జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జైశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని IMD అధికారులు హెచ్చరించారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తీవ్ర తుపానుగా మారనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది.

Exit mobile version