తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి,మెడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని ఇతర జిల్లాలోనూ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని వివరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.