తెలుగు రాష్ట్రాల్లో ఎండలు..2 రోజులు అలర్ట్ జారీ

© Envato

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి బానుడి భగభగలు క్రమంగా పెరిగాయి. ఈ క్రమంలో తెలంగాణలో బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం ఇదే అత్యధిక టెంపరేచర్ అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని వాతారవణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏపీలోని రాయలసీమలో కూడా హీట్ బాగానే పెరిగింది. దీంతోపాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతారవణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version