NH65-పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రజలు చేరుకుంటున్నారు. చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణిస్తుండటంతో NH65పై రద్దీ ఎక్కువైంది. పంతంగి టోల్ ప్లాజా దాటేందుకు 30నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.