ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉక్రెయిన్ ఇంటిరియర్ మినిస్టర్ డెనిస్ మొనాస్టైర్స్కీతో పాటు మరో 10 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. కీవ్‌కు సమీపంలోని బ్రోవరి వద్ద హెలికాప్టర్ కూలినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.