మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టడంపై దర్శకుడు బాబీ వివరణ ఇచ్చాడు. ‘చిరంజీవి నాన్నతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఉండేవారు. ఆయనే రూ.500 ఇచ్చి చిరంజీవితో ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోల వల్లే చెన్నైకి రాగలిగానని చిరంజీవి చెబుతుంటారు. ఆ కానిస్టేబుల్ పేరు వీరయ్య. అలాగే, వెంకీమామ షూటింగ్ సమయంలో నాజర్ ఒక బుక్ ఇచ్చారు. అందులో వీరయ్య పేరు ఎంతో ఆకట్టుకుంది. చిరంజీవికి చెప్తే బాగుందన్నారు. అందుకే ఇలా లాక్ చేశాం’ అని బాబీ వెల్లడించారు.