‘ఆర్ఎక్స్100’ సినిమాతో సినీ అభిమానుల మనసు దోచుకున్న హీరో గుమ్మకొండ కార్తికేయ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తనతో వరంగల్ నిట్ కళాశాలలో కలిసి చదువుకున్న లోహితారెడ్డిని మనువాడాడు. స్నేహంగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కడానికి 11 ఏళ్లు పట్టింది. భాగ్యనగరంలో జరిగిన వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, పాయల్ రాజ్పుత్, తనికెళ్ల భరణి తదితర ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్కి చెందిన కార్తీకేయ 2017లో ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ ఫేమ్ మాత్రం RX100 చిత్రంతోనే వచ్చింది. తదనాంతరం గుణ 369, హిప్పీ, 90 ML తీశారు. రీసెంట్గా ఇతడు హీరోగా నటించిన రాజా విక్రమార్క మూవీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఇతడు అజిత్ హీరోగా నటిస్తున్న వాల్మీకి అనే చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.