• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భూకంపం సంభవించిన ప్రదేశాల్లో హీరో రాట్స్ సేవలు!

    ప్రతి ఏడాది అనేక మంది ప్రజలు భూకంపాల కారణంగా శిథిలాల్లో చిక్కుకుంటారు. ఆ క్రమంలో కొన్నిసార్లు అందిరినీ తొలగించడం, కాపాడటం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో వారిని గుర్తించేందుకు ప్రస్తుతం ఎలుకలను ఉపయోగిస్తున్నారు. అందుకోసం ‘హీరో రాట్స్’ పేరుతో ఓ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 150కిపైగా ఎలుకలకు శిక్షణ ఇచ్చామని ఆఫ్రికాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకల వీపుపై ఓ చిన్న బ్యాగ్ అమర్చి వాటిలో మైక్రోఫోన్‌లు, వీడియో పరికరాలు, లొకేషన్ ట్రాకర్‌లు అమర్చుతున్నారు. దీంతో అవి వెళ్లిన ప్రదేశం సులభంగా గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.