హీరోయిన్ ప్రణీత నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసింది. మా అమ్మ గైనకాలజిస్ట్ కావడం వల్ల నా ప్రసవం సులభంగా జరిగిందని తెలిపింది. చికిత్స చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపింది. త్వరలో తన డెలివరీ స్టోరీని ఫాలోవర్స్‌తో పంచుకుంటానని చెప్పింది. ప్రణీత గతేడాది మేలో కరోనా సమయంలో వ్యాపారవేత్త నిఖిల్‌ను వివాహం చేసుకుంది. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, బావ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.