మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్మీడియా ద్వారా స్వయంగా ప్రకటించింది. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈవో షానిద్ అసీఫ్ అలీని వివాహం చేసుకుంటున్నట్లు చెప్పింది. కాబోయే భర్తతో దిగిన ఫోటోలను పూర్ణ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్ణ ఇటీవల సూపర్ హిట్ అయిన ‘అఖండ’ మూవీలో కీలక పాత్రలో నటించింది. దీంతో పాటు తెలుగులో టీవీషోలు, సినిమాలతో బిజీగా ఉన్న పూర్ణకు ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె పెళ్లి వార్త చెప్పడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
-
Courtesy Instagram: Shamna Kkasim ( purnaa ) -
Courtesy Instagram: Shamna Kkasim ( purnaa )