స్వాతంత్ర్య వేడుకల వేళ దిల్లీలో హై అలర్ట్

© ANI Photo

దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవాల సమయంలో ఉగ్ర దాడులు, అల్లర్లు జరిగే అవకాశముందన్న ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికల మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధానిలో 10వేల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా 400 మంది సైనికులను ప్రత్యేకంగా నియమించారు. ఎర్రకోట, దిల్లీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్లను మోహరించారు. ఈ నెల 13 నుంచి దిల్లీ సరిహద్దులు మూసివేయనున్నారు.

Exit mobile version